Search This Blog

Tuesday, March 06, 2007

ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే ...

పల్లవి:
నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ
మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా!

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి

చరణం 1
ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలొ
రామ చక్కని సీతకి

చరణం 2
ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటె
చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడు
రామ చక్కని సీతకి


చరణం 3
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచె
చూసుకోమని మనసు తెలిపె మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట
రామ చక్కని సీతకి

ఇందువదనా కుందరదనా మందగమనా భామా
ఎందువలన ఇందువదనా ఇంతమదనా ప్రేమా ??

ఈ పాట "గోదావరి" అను సినిమా లోనిది. వేటూరి గారు రచించారు. గాయత్రి గారు పాడారు. చాలా మంచి పాట కదూ? మీకు కూడా ఇది ఇష్టమేనా?

1 comment:

Anonymous said...

http://www.youtube.com/watch?v=i8BHjNaD0pM

Blog Archive

Followers